రామ్ పోతినేని హీరోగా తమిళ దర్శకుడు లింగుస్వామి రూపొందిస్తున్న చిత్రం 'ది వారియర్'. తెలుగు-తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాని శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ సరసన కృతిసెట్టి హీరోయిన్గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి విలన్గా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుండి ఒక అప్డేట్ వచ్చింది. ఆదివారం ఉదయం 9.46 గంటలకు ఈ సినిమా నుండి ఎక్సయిటింగ్ అప్డేట్ రాబోతుందని చిత్రబృందం తెలిపింది. ఈ మేరకు ఒక స్పెషల్ పోస్టర్ను కూడా విడుదల చేసింది. ఇటీవలే ఈ చిత్రం రెండో షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని మూడో షెడ్యూల్‌ను మొదలు పెట్టింది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల రామ్ లుక్ ఒకటి విడుదలై సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఈ చిత్రం హిందీ డబ్బింగ్ రైట్స్ రూ. 16 కోట్ల రూపాయలకి అమ్ముడైనట్లు తెలుస్తోంది. తెలుగు, తమిళ భాషలకు కలిపి ఈ సినిమా హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ రూ. 35 కోట్లకు కొనుగోలు చేసినట్టు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa