రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, అలియాభట్, ఒలీవియా మోరిస్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం "ఆర్ఆర్ఆర్ ". రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే విడుదలై ఇండియన్ సినిమా సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది.
ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు ఇండస్ట్రీ వర్గాలను ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. మొదటి రోజు దాదాపు అన్ని ఏరియాల్లో డబుల్ మార్జిన్లు కొట్టిన ఈ సినిమా ఇప్పుడు రెండో రోజు కూడా సాలిడ్ హోల్డ్‌లో నిలిచింది. ఈ సినిమా నైజాంలో వరుసగా రెండో రోజు 15 కోట్ల షేర్ ని అందుకున్నట్లు సమాచారం. రెండు రోజుల్లో ఈ చిత్రం రూ.38.3 కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద నాన్ ఆర్ఆర్ఆర్ రికార్డును సాధించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa