రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్,రామ్ చరణ్,అలియా భట్,అజయ్ దేవగన్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా తెలుగు రాష్ట్రాల బాక్స్ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది.ఈ మూవీకి అన్నిచోట్ల నుండి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి.హిందీలో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ స్లో అయినప్పటికీ,ఈ సినిమా 19కోట్లు వసూలు చేసింది.'RRR' సినిమా శనివారం నాడు 24కోట్లు వసూలు చేయగా ,ఆదివారం నాడు హిందీ బెల్ట్‌లో 31కోట్ల నెట్‌ని వసూలు చేసింది.దీంతో ఇప్పటివరకు ఈ సినిమా 74కోట్లు రాబట్టింది.ఈ చిత్రాన్ని డివివి దానయ్య భారీ స్థాయిలో నిర్మించారు.ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa