ఇటీవలే విడుదలై టాలీవుడ్ సెన్సేషన్‌గా నిలిచింది ‘భరత్ అనే నేను’ చిత్రం. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ముఖ్యమంత్రిగా మహేష్ బాబు నటన విశేషాదరణ పొందిన సంగతి తెలిసిందే. ఇక మహేష్ సరసన కైరా అద్వానీ అందాల చిందులు యువతను మత్తెక్కించాయి. తెలుగులో మొదటి సినిమాతోనే తనకంటూ ఓ అభిమాన వర్గాన్ని ఏర్పాటు చేసుకుంది ఈ సుందరి. ‘భరత్’ విజయం, తాను చూపిన పర్ఫార్మెన్స్‌కి అంతా ఫిదా కావడం.. ఆమెలో నూతనోత్సాహం నింపింది.
కాగా ఈ రోజు(జూన్ 15) కొరటాల శివ పుట్టినరోజు. 1975 జూన్ 15న జన్మించిన ఈయన నేటితో 43 సంవత్సరాలు పూర్తిచేసుకొని 44 వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా కైరా అద్వానీ తన హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. ‘‘ఎంతో ఉత్తమమైన, వినయపూర్వకమైన నా తొలి తెలుగు సినిమా దర్శకులు కొరటాల శివ గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆ దేవుడి కటాక్షంతో మున్ముందు అత్యంత అద్భుతమైన విజయాలు మీకు దక్కాలని కోరుకుంటున్నా. మీ ముఖంలో చిరునవ్వు ఎప్పటికీ ఇలాగే ఉండాలని ఆశిస్తున్నా. మిమ్మల్ని ఎప్పటికీ గౌరవిస్తూనే ఉంటా’’ అని టాగ్ చేస్తూ కొరటాలకు నమస్కారం చేస్తున్న ఫొటో జతచేసింది కైరా. ఈ ట్వీట్ చూసిన పలువురు అభిమానులు లైక్ చేస్తూ కొరటాలకు వారి వారి విషెస్ తెలుపుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa