ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాని కొత్త సినిమాకి దర్శకుడు ఎవరంటే !

cinema |  Suryaa Desk  | Published : Fri, Jun 15, 2018, 11:36 AM

న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం శ్రీ రామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగార్జున తో కలిసి మల్టి స్టారర్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు అయన బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ 2 కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు .ఇవి కాకుండా తాజాగా ‘మళ్ళీ రావా’ చిత్ర డైరెక్టర్ గౌతమ్ తెరకేకించే సినిమాలో నటించనున్నాడు నాని. ఈ చిత్రాన్ని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిచనుంది . ఈ విషయాన్ని కొద్దిసేపటి క్రితమే అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ చిత్ర టైటిల్ ను రేపు ప్రకటించనున్నారు .


గత ఏడాది 3 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని ఈ ఏడాది కూడా 3 సినిమాలను విడుదలచేసుకునేట్టుగా ప్లాన్ చేసుకుంటున్నాడు. గత ఏప్రిల్ నెలలో నాని నటించిన’ కృష్ణార్జునయుద్ధం’ విడుదలయింది. ఈ సినిమా అనుకునంత విజయాన్ని ఇవ్వలేదు. మరి మిగిలిన రెండు సినిమాలతోనైన నాని మళ్ళి ట్రాక్ లోకి వస్తాడేమో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa