కెరీర్ ప్రారంభంలో ప్రేమ కావాలి, లవ్లీ, సుకుమారుడు వంటి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ లతో మంచి విజయాలందుకున్నాడు ఆది సాయికుమార్. అదే జోరుతో వరస సినిమాలు చేస్తున్నప్పటికీ ఆదికి విజయం మాత్రం వరించట్లేదు. తాజాగా బ్లాక్ అనే చిత్రంలో నటించిన ఆది ఆ సినిమాపై గట్టి నమ్మకంతో ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ చిత్రంతో ఆది మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి రావాలని చూస్తున్నాడు. జీబీ కృష్ణ డైరెక్షన్లో యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని మహంకాళి దివాకర్ నిర్మిస్తున్నారు. ఆది సరసన దర్శన బానిక్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ చిత్ర దర్శకుడు మాట్లాడుతూ... ఆది నటన, కథనం మూవీలో హై లైట్ గా నిలుస్తాయి. నిర్మాత మహంకాళి దివాకర్ గారు ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏప్రిల్ మొదటివారంలో ఈ మూవీ ట్రైలర్ ను, ఏప్రిల్ 22న సినిమాను విడుదల చేస్తామని తెలిపారు. బిగ్ బాస్ ఫేమ్ కౌశల్ మందా, ఆమని, పృథ్వి రాజ్,సత్యం రాజేష్, తాగుబోతు రమేష్ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa