ఈ ఏడాది ప్రధమార్ధంలోనే హ్యాట్రిక్ విజయాలను అందుకున్న సమంత తాజాగా యు టర్న్ మూవీలో నటిస్తున్నది.. కన్నడంలో అదే పేరుతో తెరకెక్కిన ఈ మూవీని తెలుగులో రీమేక్ చేస్తున్నారు.. కన్నడ ఒరిజినల్ దర్శకుడు పవన్ కుమార్ ఈ తెలుగు వెర్షన్ కు కూడా డైరెక్టర్.. రాజమండ్రి లో తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్నది..మహానటి చిత్రంలో జర్నలిస్ట్ మధురవాణిగా కనిపించిన సమంత ఈ చిత్రంలోను పాత్రికేయురాలిగా కనిపించనుంది. ఓ ఫ్లై ఓవర్ పై తరచు ప్రమాదాలు జరుగుతుండంతో దానిపై ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ చేసే పాత్రలో సమంత నటిస్తున్నది. ఈ చిత్రంలో భూమిక, ఆది పినిశెట్టి, హుల్ రవీంద్రన్ కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు. లో బడ్జెట్‌తో రీమేక్ చిత్రం రూపొందుతుండటం, కథ బాగా నచ్చడంతో సమంత పారితోషికం లేకుండా నటిస్తున్నది..కాగా, ఈ సినిమా లొకేషన్‌కి సంబంధించిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దర్శకుడు సమంత, ఆది పినిశెట్టికి సీన్ వివరిస్తున్న ఫోటో ఇది.. మీరూ చూడండి
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa