ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'బీస్ట్'.లో అదగొట్టే సాంగ్ వచ్చేసింది

cinema |  Suryaa Desk  | Published : Fri, Apr 01, 2022, 10:02 PM

విజయ్ నుంచి వస్తున్న మరో భారీ యాక్షన్ మూవీనే 'బీస్ట్'. సన్ పిక్చర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. పూజ హెగ్డే కథానాయికగా అలరించనున్న ఈ సినిమాకి అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమా నుంచి కొన్ని రోజుల క్రితం 'అరబిక్ కుతూ' సాంగ్ ను రిలీజ్ చేశారు. అప్పటి నుంచి కూడా ఈ పాట వ్యూస్ పరంగా కొత్త రికార్డులను నమోదు చేస్తూ వెళుతోంది. తాజాగా ఈ పాట 250 మిలియన్ మార్క్ ను క్రాస్ చేసింది. ఈ తరహాలో పాటను డిజైన్ చేయడానికి మిగతా వాళ్లంతా కసరత్తు చేసేలా ఈ పాట ప్రభావితం చేసింది. తమిళంతో పాటు ఇతర భాషల్లోనూ ఈ నెల 13వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేస్తున్నారు. ఇంతకుముందు విజయ్ చేసిన 'మాస్టర్' ను మించిన ఓపెనింగ్స్ తో ఈ సినిమా కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందని అంటున్నారు. అభిమానుల అంచనాలను ఈ సినిమా ఎంతవరకూ అందుకుంటుందనేది చూడాలి మరి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa