హీరోగాను .. నిర్మాతగాను కొత్త ప్రయోగాలతో కల్యాణ్ రామ్ ముందుకు వెళుతున్నాడు. తన సొంత బ్యానర్ పై ఆయన 'బింబిసార' సినిమాను నిర్మించాడు. ఈ కథ గతంలోనూ .. వర్తమానంలోను నడుస్తూ ఉంటుందని అంటున్నారు. అందువలన కల్యాణ్ రామ్ రాజుగానే కాకుండా, మోడ్రన్ లుక్ తోను కనిపించనున్నాడని చెబుతున్నారు. కీరవాణి - చిరంతన్ భట్ కలిసి పనిచేసిన ఈ సినిమాకి, వశిష్ఠ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో ఆయన సరసన నాయికలుగా కేథరిన్ .. సంయుక్త మీనన్ కనిపించనున్నారు. ఈ సినిమా కొంతకాలం క్రితమే పూర్తయినప్పటికీ సరైన రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తూ వచ్చారు. 'ఉగాది' సందర్భంగా రేపు ఉదయం 11:34 నిమిషాలకు రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు. ఇంతకుముందు కల్యాణ్ రామ్ చేసిన '118' హిట్ కొట్టగా, 'ఎంతమంచివాడవురా' ఫరవాలేదనిపించుకుంది. ఆ తరువాత కల్యాణ్ రామ్ చేసిన సినిమా ఇదే. తన కెరియర్లో తొలిసారిగా ఆయన చారిత్రక నేపథ్యాన్ని టచ్ చేశాడు. ఆయన చేసిన ఈ ప్రయోగం ఎలాంటి రిజల్టును రాబడుతుందో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa