2018లోనే తెలుగు సినీ రంగ ప్రవేశ చేసినప్పటికీ 2022లో నటించిన "DJ టిల్లు" మూవీతోనే హీరోయిన్ నేహశెట్టి కి మంచి గుర్తింపు వచ్చింది. రాధికగా ఈ సినిమాలో చేసిన నటనకు కుర్రకారు ఆమె పై మనసు పారేసుకున్నారు. ఈ సినిమాతో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించింది నేహా. ఈ సినిమా ఘనవిజయంతో ఆమెకు వరసగా సినిమా అవకాశాలు వస్తున్నాయట. ప్రముఖ నిర్మాణసంస్థల నుండి నేహాకు పెద్ద సినిమాలలో ఆఫర్లు వస్తున్నాయని సమాచారం. అయితే సినిమాలో తన పాత్రకు తగినంత గుర్తింపు ఉంటేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తుందట నేహా.
పొతే... ఈ వారంలో ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ తో నటించి మరింత ఫేమ్ తెచ్చుకుంది నేహా. ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో కు సంబంధించిన ఒక ప్రొమోషన్ యాడ్ లో వీరిద్దరూ కలిసి నటించారు. ఇప్పటికే ఆ యాడ్ బుల్లితెరపై సందడి చేస్తుంది. ఇంతలోనే మరో యాడ్ ఛాన్స్ కొట్టేసింది. ఈ సారి మ్యాగజైన్ కవర్ పేజీపై గ్లామర్ సందడి చేసింది. హైదరాబాద్ కు చెందిన WOW మ్యాగజైన్ కవర్ పేజీపై బ్లూ డ్రెస్ లో ట్రెండీ లుక్లో దర్శనమిస్తున్న నేహా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ప్రస్తుతం నేహా పిక్స్ వైరల్ అవుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa