దర్శకధీరుడు రాజమౌళి రూపందించిన పాన్ ఇండియా మల్టీస్టారర్ చిత్రం ఆర్ ఆర్ ఆర్. జూనియర్ ఎన్టీయార్, రామ్ చరణ్ తేజ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం మార్చి 25న విడుదలై ప్రభంజనం సృష్టిస్తుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో కొత్త రికార్డులను నమోదు చేస్తుంది. ముఖ్యంగా మెగా నందమూరి ఫాన్స్ కి ఈ సినిమా ఒక పెద్ద పండగే. మూడున్నరేళ్లుగా తమ అభిమాన హీరోలు పడ్డ కష్టానికి విలువైన మూల్యం చెల్లిస్తున్నారు.
పొతే... తాజాగా ఈ మూవీకి రెండవ భాగం కూడా ఉంటుందని చెప్పి ప్రేక్షకుల్లో కొత్త ఉత్తేజాన్ని నింపారు రచయిత విజయేంద్రప్రసాద్. ఈ మధ్యనే తమ ఇంటింకి విచ్చేసిన తారక్ తో ఇందుకు సంబంధించి కొన్ని స్టోరీ లైన్లను కూడా చర్చించినట్టు ఆయన చెప్పారు. దైవం తలిస్తే ఖచ్చితంగా RRR 2 ఉంటుందని తేల్చిచెప్పేశారు విజయేంద్రప్రసాద్ గారు. దీంతో మెగా, నందమూరి అభిమానులతో పాటు అశేష సినీ ప్రేక్షక లోకం కూడా ఆనందంలో మునిగి తేలుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa