మాస్ ఇమేజ్ సాధించడానికే హీరో రామ్ ఆసక్తి చూపుతున్నాడు. అలాగే తనని ఇంతవరకూ ప్రేక్షకులు చూడని కొత్త లుక్ తో కనిపించాలని అనుకున్నాడు. ఆ ప్రయత్నంలో భాగంగా ఆయన చేసిన సినిమానే 'ది వారియర్'. శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమాకి లింగుసామి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ రోజున 'ఉగాది' పండుగ కావడంతో ఈ సినిమా టీమ్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఒక కొత్త పోస్టర్ ను వదిలారు. బుల్లెట్ పై పోలీస్ ఆఫీసర్ గా సీరియస్ లుక్ తో రామ్ ఈ పోస్టర్లో కనిపిస్తున్నాడు. ఆయన లుక్ చూస్తుంటేనే ఆయన పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉండనుందనే విషయం అర్థమవుతోంది. రామ్ జోడీగా కృతి శెట్టి అలరించనుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను, జూలై 14వ తేదీన విడుదల చేయనున్నారు. తెలుగుతో పాటు తమిళంలోను ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా తరువాత బోయపాటితో కలిసి రామ్ సెట్స్ పైకి వెళ్లనున్న సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa