తల్లి పాత్ర చేయడానికి మరోమారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కీర్తి సురేష్. ఇదిలావుంటే శర్వానంద్ కొంతకాలంగా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. ఇటీవల వచ్చిన 'ఆడవాళ్లు మీకు జోహార్లు' కూడా ఆయనను నిరాశ పరిచింది. ఈ నేపథ్యంలోనే కృష్ణచైతన్య దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. విభిన్నమైన కథాకథనాలతో ఈ సినిమా నిర్మితం కానుంది. ఈ సినిమాలో శర్వానంద్ ఓ బిడ్డకి తండ్రి పాత్రలో కనిపించనున్నాడు. ఆయన సరసన నాయికగా కృతి శెట్టిని సంప్రదిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే కెరియర్ ఆరంభంలో తాను ఇలా తల్లి పాత్రలు చేయనని కృతి శెట్టి చెప్పిందట. దాంతో ఈ పాత్ర కోసం కీర్తి సురేశ్ ను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. సాధారణంగా చెల్లి పాత్రలు .. తల్లి పాత్రలు చేయడానికి యంగ్ హీరోయిన్లు అంగీకరించరు. కానీ కీర్తి సురేశ్ ఈ తరహా పాత్రలు చేయడానికి వెనుకాడదు. ' పెంగ్విన్' సినిమాలో ఒక బిడ్డకి తల్లిగా .. 'అన్నాత్తే'లో రజనీకి చెల్లిగా కనిపించిన కీర్తి సురేశ్, శర్వానంద్ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు. ప్రస్తుతం ఆమె చేసిన 'సర్కారువారి పాట' విడుదలకి సిద్ధమవుతూ ఉండగా, సెట్స్ పై 'దసరా' ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa