ప్రముఖ బుల్లితెర యాంకర్, సినీ నటి అనసూయ తన డ్రెస్సింగ్ విషయంలో తరచుగా నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కొంటుంటుంది. తాజాగా మరోసారి ఆమెకు అలాంటి అనుభవమే మరోసారి ఎదురైంది. గతంలో అనసూయ వేసుకున్న ఒక పొట్టి డ్రస్సుపై ఓ నెటిజన్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. ఇద్దరు పిల్లల తల్లి అయిన మీరు, ఇలాంటి పొట్టి దుస్తులు ధరిస్తూ, తెలుగు ఆడపడుచుల పరువు తీస్తున్నారని విమర్శించాడు. ఈ వ్యాఖ్యలపై అనసూయ ఘాటుగా స్పందించింది. 'దయచేసి మీరు మీ పనిని చూసుకోండి. నన్ను నా పనిని చేసుకోనివ్వండి. మీరు ఇలా ఆలోచించి మగజాతి పరువు తీస్తున్నారు' అని ఆగ్రహం వ్యక్తం చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa