ఒక వైపున నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్రలను చేస్తూనే, మరో వైపున నాయిక ప్రధానమైన పాత్రలను చేస్తూ వరలక్ష్మి శరత్ కుమార్ దూసుకుపోతోంది. తమిళంతో పాటు తెలుగులోను ఆమె మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. తెలుగులో బాలకృష్ణ - గోపీచంద్ మలినేని కాంబోతో పాటు, 'యశోద' సినిమాలో కీలకమైన పాత్రను చేస్తోంది. నాయిక ప్రధానమైన కథతో ఆమె తాజా చిత్రమైన 'శబరి'ని ఈ రోజున లాంచ్ చేశారు. మహేంద్రనాథ్ నిర్మాణంలో అనిల్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది.
సతీశ్ వేగేశ్న క్లాప్ తో .. బి. గోపాల్ గౌరవ దర్శకత్వంలో షూటింగ్ ప్రారంభమైంది. సైకలాజికల్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమా నుంచి కాన్సెప్ట్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ నెల 11వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. హైదరాబాద్, వైజాగ్, కొడైకెనాల్ ప్రాంతాల్లో షూటింగు జరుపుకోనుంది. గణేశ్ వెంకట్రామన్, శశాంక్, మైమ్ గోపీ, ఆశ్రిత వేముగంటి ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa