ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దూసుకుపోతున్న 'బీస్ట్' అరబిక్ కుతు తెలుగు సాంగ్

cinema |  Suryaa Desk  | Published : Mon, Apr 04, 2022, 06:28 PM

ప్రేక్షకులను ఉర్రూతలూగించిన బీస్ట్ సినిమాలోని అరబిక్ కుతు సాంగ్ తెలుగులో విడుదలైంది. 'హలమితి హబిబో' పేరుతో లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ తెలుగు పాటను శ్రీ సాయి కిరణ్ రాశాడు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు. తమిళంలో ఈ పాట రికార్డులు కొల్లగొట్టింది. యూట్యూబ్‌లో ఏకంగా 26.43 కోట్ల వ్యూస్ వచ్చాయి. 5.5 మిలియన్ల లైక్స్ సొంతం చేసుకుంది. విజయ్ హీరోగా నటించిన ఈ మూవీ ఏప్రిల్  13న రిలీజ్ కానుంది.


తెలుగులోను ఈ సినిమాను ఇదే టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. మాస్ యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ సినిమాకి  శ్రీసాయి కిరణ్ సాహిత్యాన్ని అందించిన ఈ పాటను అనిరుధ్ - జొనిత గాంధీ ఆలపించారు. రీసెంట్ గా రిలీజ్ చేసిన తమిళ ట్రైలర్ కి అనూహ్యమైన రెస్పాన్ వచ్చింది. రేపు సాయంత్రం 6 గంటలకు తెలుగు ట్రైలర్ ను వదలనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa