వరుణ్ తేజ్ గని సినిమా టికెట్ ధరలను తగ్గించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల 'ఆర్ఆర్ 'ఆర్' సినిమాకు ధరలు పెంచుకునేందుకు అవకాశం కల్పించిన ప్రభుత్వం.. గని కోసం మల్టీప్లెక్స్‌లో రూ.200+జీఎస్టీ, సింగిల్ స్క్రీన్‌లో రూ.150+జీఎస్టీ వసూలు చేయాలని ఆదేశాలిచ్చింది. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాను కిరణ్ కొర్రపాటి డైరెక్ట్ చేయగా.. ఈ నెల 8న రిలీజ్ కానుంది. నదియా, ఉపేంద్ర, జగపతి బాబు, సునీల్ సెట్టి, సాయి మంజ్రేకర్, నరేష్, నవీన్ చంద్ర ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించాలంటే టికెట్ ధరలను తగ్గించడం ఒక్కటే సరైన మార్గమని తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది., ముఖ్యంగా చిన్న చిత్రాలు ఆధరణకు నోచుకోవాలంటే టికెట్ ధరలు అందుబాటులో ఉండాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ‘గని’ చిత్రానికి టికెట్ ధరలు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa