ఎవరికైనా తమ విజయం పరంపరం కొనసాగితే వారిలో ఉండే జోష్ వేరు. తాజాగా ఆర్ఆర్ఆర్ బ్లాక్ బస్టర్ విజయంతో ఆనందోత్సాహాల్లో ఉన్న టాలీవుడ్ అగ్రహీరో రామ్ చరణ్ నిన్న ముంబయిలో పర్యటించారు. అక్కడ ఓ థియేటర్లో ఆర్ఆర్ఆర్ ను వీక్షించారు. అక్కడి అభిమానులను అలరించారు. ఇదిలావుంటే బాంద్రాలోని మిజూ రెస్టారెంట్ లో విందు అనంతరం ఆయన బయటికొచ్చి కారెక్కబోతుండగా, ఓ బిచ్చగత్తె డబ్బులు అడిగింది. వెంటనే స్పందించిన రామ్ చరణ్... కారు వద్దకు రావాలని చెబుతూ ఆమెకు చిరునవ్వుతో డబ్బులు అందించారు. అనంతరం అక్కడినుంచి నిష్క్రమించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa