బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, రాజమౌళి 'RRR' సినిమాలో స్క్రీన్ పై చివరిగా కనిపించాడు. ఈ స్టార్ హీరో ఇప్పుడు తన కొత్త మూవీ 'రన్‌వే 34' విడుదల కోసం సిద్ధం అవుతున్నడు. మే 3వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్ కూడా ప్రారంభించాడు. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం, ఈ నెల 14న విడుదల కానున్న రాకింగ్ స్టార్ యాష్ నటిస్తున్న 'KGF2' తో పాటు 'రన్‌వే 34' ట్రైలర్‌ను ప్రసారం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అజయ్ దేవ్‌గణ్ ఎఫ్‌ఫిల్మ్స్, కుమార్ మంగత్ పాఠక్, విక్రాంత్ శర్మ, సందీప్ హరీష్ కెవ్లానీ, తర్లోక్ సింగ్ జేథి, హస్నైన్ హుసైనీ అండ్ జే కనుజియా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. మరి సినిమా ఎలా ఉంటుందో వేచి చుడాలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa