ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అండ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సెన్సషనల్ రికార్డ్స్ ని సృష్టిస్తోంది. ఈ యాక్షన్ డ్రామా సినిమాలో అలియాభట్ అండ్ ఒలివియా మోరిస్ హీరోయిన్స్ గా నటించారు. MM కీరవాణి అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ 'RRR' సినిమా విజయంలో ప్రధాన పాత్ర పోషించింది అని చెప్పొచ్చు. తాజాగా ఇప్పుడు ఈ స్టార్ మ్యూజిక్ కంపోజర్ ఈ సినిమాపై ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు. కీరవాణి తన ట్విటర్ ప్రొఫైల్ లో ఓఎస్‌టిని ఒక నెలలోపు విడుదల చేస్తానని చెప్పారు. ఓఎస్‌టీలో కొమ్మా ఉయ్యాల అనే బిట్ సాంగ్ కూడా ఉంటుందని వెల్లడించారు. ఈ సినిమాలో అజయ్ దేవగన్, సముద్రఖని, శ్రియా శరణ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. డివివి దానయ్య ఈ సినిమాని నిర్మించగా, సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa