నాని కథానాయకుడిగా 'అంటే .. సుందరానికీ' సినిమా రూపొందింది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి, వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు. 'బ్రోచేవారెవరురా' సినిమాతో దర్శకుడిగా తన సత్తా చాటుకున్న ఆయన, నానీతో ఈ సినిమాను రూపొందించాడు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. జూన్ 10వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక సాంగ్ ప్రోమోను వదిలారు. ఒక సంప్రదాయబద్ధమైన కుటుంబంలో ఆచార వ్యవహారాల మధ్య పెరిగిన సుందరం, విదేశాలకి వెళ్లి అక్కడ పడే అవస్థలే ఈ కథ. పంచెకట్టుతో నాని విదేశాల్లోని వీధుల్లో తిరగడం ఈ సాంగ్ ప్రోమోలో కనిపిస్తోంది. పూర్తి పాటను రేపు సాయంత్రం 6:03 నిమిషాలకు విడుదల చేయనున్నట్టు చెప్పారు. వివేక్ సాగర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాతో తెలుగు తెరకి నజ్రియా నజీమ్ పరిచయమవుతోంది. ముఖ్యమైన పాత్రల్లో నదియా .. రోహిణి .. హర్షవర్ధన్ .. సుహాస్ కనిపించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa