యంగ్ హీరో శ్రీవిష్ణు నటిస్తున్న సినిమా 'అల్లూరి'. ఈ సినిమాకి ప్రదీప్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ప్రీ లుక్ పోస్టర్‌ను మాస్ మహారాజా రవితేజ మంగళవారం విడుదల చేశారు. ఈ సినిమాలో శ్రీవిష్ణు పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. గత కొన్ని నెలలుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. త్వరలో విడుదల తేదీని ప్రకటించనున్నారు చిత్ర బృందం. ఈ సినిమాకి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాని లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కెం వేణు గోపాల్ బెక్కం బబితా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa