జాతీయ అవార్డు గ్రహీత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఒక సినిమా చేయబోతున్నారు. విజయ్ కెరిరీలో 66వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రంలో థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ విషయాన్నిచిత్ర బృందం తెలిపింది. దీనికి సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేసారు. వెల్కమ్ ఆన్ బోర్డ్ థమన్ అంటూ చిత్రబృందం ఈ పోస్టర్ రిలీజ్ చేసారు. ఈ సినిమా తెలుగు,తమిళ భాషలలో రిలీజ్ కానుంది. ఈ సినిమాని దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa