టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం F3 సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ టాలెంటెడ్ దర్శకుడు తన తర్వాతి సినిమాను బాలకృష్ణతో చేయబోతుండగా.. ఇది మల్టీస్టారర్ మూవీగా ప్రచారం నడుస్తోంది. బాలయ్యతో పాటు ఈ చిత్రంలో రవితేజ నటిస్తాడని తెలుస్తుండగా.. త్వరలోనే ఈ మల్టీస్టారర్ మూవీపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
అయితే ఎప్పటినుండో బాలయ్య బాబు.. అనిల్ రావిపూడి దర్శకత్వం లో సినిమా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా బాలయ్య బాబుతో చేయబోయే సినిమాలో రవితేజకి కూడా క్యారెక్టర్ సెట్ చేసినట్లు త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్ నడుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa