జాతీయ అవార్డు గ్రహీత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఒక సినిమా చేయబోతున్నారు. విజయ్ కెరిరీలో 66వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రంలో కథానాయికగా నేషనల్ క్రష్ రష్మిక మండన్నా నటించబోతున్నట్లు ఒక పోస్టర్ విడుదలైంది. ఈ రోజు రష్మిక పుట్టినరోజు కావడంతో ఆమె నటిస్తున్న కొత్త చిత్రాలనుండి వరస అప్డేట్ లు వస్తున్నాయి. హను రాఘవపూడి-దుల్కర్ సల్మాన్ ల లెఫ్టినెంట్ రామ్ చిత్రంలో ముస్లిం యువతిగా నటిస్తున్న రష్మిక కు సంబంధించిన గ్లిమ్స్ విడుదలైన కొద్ది గంటల వ్యవధిలోనే విజయ్-వంశీ చిత్రం నుండి మరో కొత్త అప్డేట్ వచ్చింది. వెల్కమ్ ఆన్ బోర్డ్ రష్మిక మందన్నా అంటూ రిలీజ్ చేసిన ఈ పోస్టర్ తో చిత్రబృందం ఆమెకు జన్మదిన శుభాకాంక్షలను తెలియజేసింది. ఈ రోజు తన 26 వ పుట్టినరోజును జరుపుకుంటున్న రష్మిక తెలుగు,తమిళ,హిందీ భాషలలో వరసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa