మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న కొత్త చిత్రం గని. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో నడిచే ఈ సినిమాకి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించగా, సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటించింది. అల్లు బాబీ, సిద్దూ ముద్దా సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర, బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టి, జగపతిబాబు, నదియా, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. కరోనా కారణంగా విడుదల ఆలస్యమైన ఈ సినిమా ఏప్రిల్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇటీవలే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్ లో జరిగింది. ఆ ఈవెంటుకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ గా పాల్గొని మూవీ పై అంచనాలను పెంచేశారు. తాజాగా ఈ మూవీ హైదరాబాద్ లో మరొక ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరుపుకోనున్నట్లు తెలుస్తోంది. ఫిలిం నగర్ లోని జేఆర్సీ కన్వెన్షన్ హాల్ లో సాయంత్రం ఆరు గంటలకు గని ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ మేరకు చిత్రబృందం ఒక అధికారిక పోస్టర్ను విడుదల చేసారు.
ఈ సినిమా ముగ్గురికి చాలా స్పెషల్. వారెవరంటే... నిర్మాత అల్లు బాబీ, దర్శకుడు కిరణ్ కొర్రపాటి, హీరోయిన్ సయీ మంజ్రేకర్. ఈ ముగ్గురికి కూడా గని మొదటి సినిమా. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa