టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య తన తదుపారి సినిమాని తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు తో చేయనున్నాడని కొన్నాళ్ల నుండి వార్తలు వినబడుతున్నాయి. ఇప్పుడా వార్తలను నిజం చేస్తూ ఆ మూవీ నుండి అధికారిక ప్రకటన వచ్చేసింది. నాగ చైతన్య కెరీర్లో 22వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించనున్నారు. ఈ సినిమాతో చైతూ కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాను చిట్టూరి శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన మిగిలిన విషయాలను త్వరలోనే వెల్లడిస్తామని ప్రకటించారు. 2022 సంక్రాంతి కి బంగార్రాజుగా పలకరించిన చైతూ ఆ సినిమాతో మంచి విజయాన్నందుకున్నాడు. బంగార్రాజు తర్వాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చైతూ నటించిన థాంక్యూ సినిమా త్వరలోనే విడుదలకానుంది. ఆ చిత్రంలో రాశీఖన్నా కధానాయిక.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa