కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ 66వ సినిమాగా తెరకెక్కుతున్న చిత్రానికి తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వం చేయనున్నారు. ఇందులో హీరోయిన్గా రష్మిక మండన్నాని ప్రకటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.
తాజాగా ఈ రోజు ఈ సినిమా ప్రారంభ కార్యక్రమం జరిగింది. హీరో విజయ్, రష్మిక మండన్నా, దర్శకుడు వంశీ పైడిపల్లి, నిర్మాత దిల్ రాజులతో పాటు మిగిలిన చిత్రబృందం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రోజు నుండి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరుగుతుందని తెలియజేసింది చిత్రబృందం. మునుపెన్నడూ నటించని ఒక కొత్త కధ తో విజయ్ ఈ సినిమాలో నటిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa