ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'ఓహ్ మై డాగ్' సినిమా

cinema |  Suryaa Desk  | Published : Wed, Apr 06, 2022, 04:44 PM

సరోవ్ షణ్ముగం దర్శకత్వంలో స్టార్ హీరో అరుణ్ విజయ్ అండ్ అతని కుమారుడు అర్నవ్ విజయ్ ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ తమిళ సినిమాకి 'ఓహ్ మై డాగ్' అనే టైటిల్ ని మేకర్స్ లాక్ చేసారు. ఎట్టకేలకు ఈ OTT సినిమా కొత్త విడుదల తేదీని పొందింది. తాజాగా ఈరోజు, మూవీ మేకర్స్ ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఏప్రిల్ 21, 2022న ప్రదర్శించబడుతుందని ప్రకటించారు. ఈ సినిమాలో సీనియర్ యాక్టర్ విజయ్‌కుమార్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో తమిళంతో పాటుగా తెలుగులో కూడా విడుదల కానుంది. 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై స్టార్ కపుల్ సూర్య అండ్ జ్యోతిక ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి నివాస్ ప్రసన్న సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa