ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో రాకింగ్ స్టార్ యష్ నటించిన 'KGF 2' ఏప్రిల్ 14, 2022న ప్రపంచవ్యాప్తంగా థియేటర్‌లలో గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో యాష్ సరసన జోడిగా శ్రీనిధి శెట్టి నటిస్తుంది. ప్రకాష్ రాజ్, సంజయ్ దత్, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా మూవీ మేకర్స్ ఈరోజు నుండి నార్త్ ఇండియా, తమిళనాడు అండ్ కేరళలో బుక్‌మైషో అండ్ పేటిఎమ్‌లలో ఈ సినిమా బుకింగ్‌లను తెరవనున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా ప్రీసేల్స్ ఖచ్చితంగా బాగుంటాయి అని అందరూ భావిస్తున్నారు. అయితే, తెలుగు రాష్ట్రాల్లో టిక్కెట్ల గురించి టీమ్ ఏమీ ప్రస్తావించలేదు. ఈ పాన్-ఇండియా మూవీకి రవి బస్రూర్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa