తమిళ హీరో శివకార్తికేయన్, జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ తో డైరెక్ట్ తెలుగు మూవీ తీస్తున్నారు అని అందరికి తెలిసిన విషయమే. తాత్కాలికంగా ఈ సినిమాకి 'SK20' అనే టైటిల్‌ని మేకర్స్ పెట్టారు. శ్రీవెంకటేశ్వర సినిమాస్ LLP, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ భారీ స్థాయిలో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మూవీ మేకర్స్ ఈ సినిమాలో శివకార్తికేయన్ సరసన జోడిగా ఉక్రెయిన్ బ్యూటీ మెరీనా ర్యాబోషప్కా కనిపిస్తుందని మేకర్స్ ప్రకటించారు. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా తమిళనాడు రీజియన్ థియేట్రికల్ రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడుపోయినట్లు సమాచారం. ఈ సినిమా తమిళనాడు థియేట్రికల్ రైట్స ని గోపురం సినిమాస్ 30 కోట్లకు సొంతం చేసుకున్నట్లు టాక్. తమిళ-తెలుగు మూవీకి టాప్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. మనోర్ పరమహంస కెమెరా క్రాంక్ చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa