టాలీవుడ్ యంగ్ హీరో రక్షిత్ శెట్టి చివరిసారిగా స్క్రీన్ పై 'అతడే శ్రీమన్నారాయణ' సినిమాలో కనిపించాడు. ఇప్పుడు తాజాగా '777 చార్లీ' అనే కొత్త సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. కిరణ్‌రాజ్ కె దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. జూన్ 10, 2022న వివిధ భాషల్లో ఈ సినిమా థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అదే విషయాన్ని తెలియజేసేందుకు స్పెషల్ పోస్టర్‌ను కూడా మేకర్స్ విడుదల చేశారు. చార్లీ, సంగీత, రాజ్ బి శెట్టి, డానిష్ సైత్, బాబీ సింహా తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. జిఎస్ గుప్తా, రక్షిత్ శెట్టి నిర్మిస్తున్న ఈ చిత్రానికి నోబిన్ పాల్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa