ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాలకృష్ణ తదుపరి చిత్రంలో రవితేజ నటించనున్నారా?

cinema |  Suryaa Desk  | Published : Mon, Apr 11, 2022, 12:47 PM

టాలీవుడ్‌లో ఈ మధ్యకాలంలో స్టార్ హీరోస్ సైతం మల్టీస్టారర్ సినిమా చేయడానికి ఇష్టపడుతున్నారు. త్వరలో మరో క్రేజీ మల్టీస్టారర్ సినిమా రాబోతోంది. నటసింహ నందమూరి బాలకృష్ణతో దర్శకుడు అనిల్ రావిపూడి ఒక సినిమా చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజా అప్డేట్ ప్రకారం, ఈ సినిమాలో టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ కూడా నటించనున్నాడని సమాచారం. అనిల్ రావిపూడి స్క్రిప్ట్ చెప్పిన వెంటనే రవితేజ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని లేటెస్ట్ టాక్. స్టార్ హీరోస్ ఇద్దరు తమ ప్రస్తుత ప్రాజెక్ట్‌లను పూర్తి చేసిన తర్వాత ఈ ముల్టీస్టార్ర్ర్ సినిమా త్వరలో ప్రారంభమవుతుంది. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa