టాలీవుడ్ హీరో నేచురల్ స్టార్ నాని నటించిన "జెర్సీ" సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాని హిందీ లో రీమేక్ చేస్తున్నా విషయం తెలిసిన సంగతే. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నఈ రీమేక్ లో షాహిద్ కపూర్, మృణాల్ ఠాకూర్ నటిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ ఇప్పుడు చివరి క్షణంలో ఈ సినిమా వాయిదా పడింది. ఇప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం, ఈ సినిమా ఏప్రిల్ 22న భారీగా విడుదల కానుంది అని సమాచారం. 'కేజీఎఫ్2' కూడా ఏప్రిల్ 14న విడుదలవుతున్న ఈ సినిమాని మేకర్స్ వాయిదా వేసినట్లు సమాచారం. దిల్ రాజుతో కలిసి అల్లు అరవింద్, నాగ వంశీ, బన్నీ వాస్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సచేత్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa