నాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ రెండోసారి జంటగా నటిస్తున్న చిత్రం దసరా. అంతకుముందు నేను లోకల్ మూవీ లో వీరిద్దరూ కలిసి నటించగా ఆ మూవీ సూపర్ హిట్ అయింది. అయితే నేను లోకల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కితే, దసరా యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది.
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ బొగ్గుగనుల నేపథ్యంలో గోదావరిఖనిలో జరిగే కథతో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ లో ఒక పాట కోసం టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ ను రంగంలోకి దింపారట చిత్రబృందం. నాని,కీ ర్తిసురేష్ లపై చిత్రీకరించనున్న ఈ పాట కోసం దాదాపు 500 మంది డాన్సర్లు వర్క్ చేస్తున్నారు. ఎండలు మండిపోతున్న వేళ బొగ్గుగనుల్లో ఈ పాటను చిత్రీకరిస్తూ చిత్రబృందం చాలా కష్టపడుతుంది. ఆర్ ఆర్ ఆర్ లో నాటు నాటు పాట కు స్టెప్పులందించటంతో ప్రేమ్ రక్షిత్ కు పాన్ ఇండియా గుర్తింపు దక్కింది. దీంతో ఈ పాటపై మంచి అంచనాలు నెలకొన్నాయి.
పోతే... దసరా సినిమాతో నాని మొదటిసారిగా పాన్ ఇండియా బరిలోకి దిగగున్నాడు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ మూవీ నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు. మార్చి నెలలో విడుదలైన ఈ మూవీ గ్లిమ్ప్స్ కు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ దక్కింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa