ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిఖిల్ 'కార్తికేయ-2' రిలీజ్ డేట్ ఫిక్స్

cinema |  Suryaa Desk  | Published : Mon, Apr 11, 2022, 09:12 PM

టాలీవుడ్ యంగ్‌ హీరో నిఖిల్ ప్రస్తుతం ఐదారు సినిమాలతో బిజీగా ఉన్నాడు. 2014లో నిఖిల్‌ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన 'కార్తికేయ' సినిమా మంచి హిట్ గా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్‌ 'కార్తికేయ 2' రానున్న విషయం తెలిసిందే.

పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ సంస్థలు నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్‌ గా అనుపమ పరమేశ్వరన్‌ నటిస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. తాజాగా ఈ సినిమాను జూలై 2న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa