ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీయార్, రామ్ చరణ్ తేజ్ లు కలిసి నటించిన పాన్ ఇండియా మల్టీస్టారర్ చిత్రం 'ఆర్ ఆర్ ఆర్'. ఆలియాభట్, అజయ్ దేవగణ్, శ్రేయా శరణ్, ఒలీవియా మోరిస్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం మార్చి 25న విడుదలై రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతోంది. ఇప్పటికీ ఆర్ ఆర్ ఆర్ థియేటర్ల బయట హౌస్ ఫుల్ బోర్డు లు దర్శనమిస్తున్నాయంటే ప్రేక్షకులు ఈ సినిమాని ఎంతగా ఆదరిస్తున్నారు, ఈ సినిమాలో ఎంత కంటెంట్ ఉందొ అర్ధమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్లను వసూలు చేసిన ఈ సినిమా నుండి తాజాగా నాటు నాటు ఫుల్ వీడియో సాంగ్ ను నిర్మాతలు విడుదల చేసారు. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ చేసిన ఈ పాట ప్రేక్షకులను థియేటర్లలో కూర్చోనివ్వదంటే నమ్మండి. ఎవరికైనా లేచి డ్యాన్స్ వెయ్యాలనిపించేస్తుంది ఈ పాటను చూస్తుంటే. ప్రేమ్ రక్షిత్ ఈ పాటకు అందించిన అద్భుతమైన స్టెప్స్, ఎం.ఎం కీరవాణి అందించిన సంగీతం తో ఈ ఫాస్ట్ బీట్ సాంగ్ కు ప్రేక్షకుల నుండి విశేష ఆదరణ దక్కుతుంది. రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ కలిసి పాడిన ఈ పాట విడుదలైన కొన్ని నిముషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పటికే చాలా మంది నెటిజన్లు నాటు నాటు పాటలో ఉండే హుక్ స్టెప్ తో రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa