అక్కినేని వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని కెరీర్‌లో వైవిధ్యమైన పాత్రలు చేస్తూ విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న హీరో నాగ చైతన్య. ఆయన నటించిన సవ్యసాచి, శైలజా రెడ్డి అల్లుడు చిత్రాలు త్వరలో విడుదల కానున్నాయి. అయితే సావిత్రి జీవిత నేపథ్యంలో తెరకెక్కిన మహానటి చిత్రంలో ఏఎన్ఆర్ పాత్ర పోషించి ప్రశంసలు అందుకున్నాడు చైతూ. పాత్ర కొద్ది సేపే అయిన ఉన్నంత టైంలో ఏఎన్ఆర్‌గా అద్భుత పర్‌ఫార్మెన్స్ ఇచ్చాడు . ఇప్పుడు మరోసారి ఏఎన్ఆర్ పాత్రలో కనిపించేందుకు సిద్ధమయ్యాడట నాగ చైతన్య. క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ రూపొందనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎన్టీఆర్ జీవితంలో కీలక వ్యక్తులుగా ఉన్నవారి పాత్రల ఎంపిక జరుగుతుంది. ఏఎన్ఆర్.. ఎన్టీఆర్ జీవితంలో కీలక వ్యక్తి మాత్రమే కాదు, వారి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు మంచి హిట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ బయోపిక్‌లో ఏఎన్ఆర్ పాత్ర కోసం చైతూని సెలక్ట్ చేశారని టాక్. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa