ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'రాజా డీలక్స్' కోసం భారీ సెట్టింగ్

cinema |  Suryaa Desk  | Published : Tue, Apr 12, 2022, 02:57 AM

 'రాజా డీలక్స్' చిత్రం కోసం భారీ సెట్టింగ్ నిర్మాణం సాగుతోంది. మారుతి దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా రూపొందిన ' పక్కా కమర్షియల్ ' సినిమా విడుదలకు ముస్తాబవుతోంది. జులై 1వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. రాశి ఖన్నా కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా విడుదల కాగానే, ఆ తరువాత ప్రభాస్ ప్రాజెక్టుపై మారుతి పూర్తి దృష్టి పెట్టనున్నట్టు తెలుస్తోంది. ప్రభాస్ హీరోగా మారుతి 'రాజా డీలక్స్' సినిమాను ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం ఓ భారీ సెట్ ను వేయిస్తున్నారట. అధిక భాగం షూటింగు ఈ సెట్ లోనే జరుగుతుందని అంటున్నారు. అందుకోసం పెద్ద మొత్తమే ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది. 


ఈ సినిమా కథాకథనాలపై మారుతి గట్టిగానే కసరత్తు చేస్తున్నాడట. తన తోటి రచయితల .. దర్శకుల సూచనలను కూడా తీసుకుంటున్నట్టుగా సమాచారం. హారర్ కామెడీ నేపథ్యంలో నడిచే ఈ కథ కోసం ప్రభాస్ 40 రోజులను మాత్రమే కేటాయించాడట. అందుకు తగినట్టుగానే ఆయన పార్టును పూర్తిచేయవలసి ఉంటుంది. ఈ సినిమాలో ముగ్గురు కథానాయికలు ఉండనున్నారని సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa