జులై 22వ తేదీన కార్తికేయ-2 విడుదల కానున్నది. ఇదిలావుంటే నిఖిల్ హీరోగా కొంతకాలం క్రితం వచ్చిన 'కార్తికేయ' భారీ విజయాన్ని నమోదు చేసింది. ఆ సినిమాకి సీక్వెల్ గా 'కార్తికేయ 2'ను రూపొందించారు. విశ్వప్రసాద్ - వివేక్ కూచిభొట్ల నిర్మించిన ఈ సినిమాకి చందు మొండేటి దర్శకత్వం వహించాడు. కలియుగానికి సంబంధించిన ఒక రహస్యాన్ని ఛేదించే ప్రయత్నంగా ఈ కథ నడుస్తుంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. జూలై 22వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు చెబుతూ, అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేశారు. కథ నేపథ్యానికి తగినట్టుగానే శ్రీకృష్ణుడి ఆకారానికి సంబంధించిన కటింగ్ ఆకట్టుకుంటోంది. హీరో ఒక దివ్యమైన నగరాన్ని దర్శిస్తున్నట్టుగా ఈ పోస్టర్ ఉంది.
ఈ సినిమాలో కథానాయికగా అనుపమ పరమేశ్వరన్ నటించింది. 'కార్తికేయ' మాదిరిగా ఈ సినిమా కూడా తనకి పెద్ద హిట్ ఇస్తుందని నిఖిల్ భావిస్తున్నాడు. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. స్వాతి రెడ్డి కూడా ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను పోషించినట్టుగా తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa