శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ "దసరా" సినిమాలో నటిస్తున్నారు. యాక్షన్ డ్రామాగా ట్రాక్ లో వస్తున్న ఈ సినిమా గోదావరిఖనిలోని సింగరేణి బొగ్గు గనులలో ఉన్న ఒక గ్రామంలో ఈ స్టోరీ వెళ్లనుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖని (తెలంగాణ)లో జరుగుతోంది. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కొరియోగ్రఫీలో నాని, కీర్తి సురేష్‌లపై ఒక పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ సాంగ్ షూట్‌లో 500 మంది డ్యాన్సర్లతో ఈ పాటను చిత్రీకరిస్తున్నారు అని టాక్. ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa