చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆచార్య. ఏప్రిల్ 29, 2022న విడుదల కానుంది. ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ఈరోజు సాయంత్రం 5:49 గంటలకు విడుదల కానుంది.
ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే ట్రైలర్ రన్ టైమ్ 2 నిమిషాల 35 సెకన్లు. ట్రైలర్ చాలా బాగా వచ్చిందని అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 150కి పైగా థియేటర్లలో ఈరోజు ట్రైలర్ కూడా విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa