ఎవరైనా తమ జీవితంలో దక్కిన అపూర్వమైన అవార్డును ఏం చేస్తారు.. భావితరాలకు చూపించడానికి భద్రంగా దాచుకుంటారు. కానీ విజయ్ అలా చేయలేదు. వెంటనే దాన్ని తెలంగాణ సీఎం సహాయనిధికి ఇచ్చేశారు. వేలం వేసి వచ్చిన డబ్బులను పేదలకు సాయం చేయాలని కోరాడు. ఈ గొప్ప మనసు ఎవరికి ఉంటుంది. అందుకే ఇప్పుడు విజయ్ పై టాలీవుడ్ - బాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ మధ్యే అర్జున్ రెడ్డి సినిమాలో నటనకు గాను విజయ్ కు తొలి ఫిలింఫేర్ అవార్డు వచ్చింది. దాన్ని సీఎం సహాయనిధికి ఇచ్చి విజయ్ అందరినీ ఆశ్చర్యపరిచాడు.
అందరూ కలల అవార్డుగా భావించే ఫిలింఫేర్ ను విజయ్ దానం ఇవ్వడం హాట్ టాపిక్ అయ్యింది. దీంతో స్వయంగా విజయ్ దేవరకొండను మెచ్చుకుందామని కేటీఆర్ ఆదివారం సాయంత్రం సర్ ప్రైజ్ ఇచ్చాడు. విజయ్ ఇంటికి వెళ్లారు. మంత్రికి విజయ్ ఇంట అపూర్వస్వాగతం లభించింది. అక్కడ వారితో సరదాగా గడిపారు. అందరూ కలిసి లంచ్ చేశారు. ఫిలింఫేర్ అవార్డు సీఎం సహాయనిధికి ఇచ్చినందుకు విజయ్ ను మంత్రి అభినందించారు.
ఈ విషయాన్ని తాజాగా విజయ్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ‘మీ ఇంటికి మీ ఇష్టమైన నాయుడు లంచ్ కు వస్తే..? ఒక్క సెకన్.. అసలేం జరుగుతోంది బాస్.. ఏదైనా జరగవచ్చు. మనకు నచ్చింది మనం చేసుకుంటూ పోవాలంతే.. ’ అన్న కామెంట్ తో ట్వీట్ చేశారు. కేటీఆర్ వారం రోజులు బిజీగా రాజకీయాల్లో ఉంటారు. వివిధ అభివృద్ధి పథకాలు - పార్టీ మీటింగ్ లతో గడుపుతారు. కానీ ప్రతి వీకెండ్ రోజు ఖచ్చితంగా ఫ్యామిలీతో కలిసి సినిమా చూడడమో లేక.. ఎవరి ఇంటికి వెళ్లి గడపడమో చేస్తుంటాడు. ఇప్పుడూ అదే చేశాడు. ఈ ఆదివారం సాయంత్రం విజయ్ ఇంటికి వెళ్లి సర్ ప్రైజ్ ఇచ్చాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa