ప్రస్తుతం టాలీవుడ్‌లో నంబర్ వన్ స్థానంలో పూజా హెగ్డే ఉంది. టాప్ హీరోలందరి సరసన నటిస్తోంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ చిత్రాల్లోనే అ అమ్మడి హవా బాగానే ఉంది. ఈ తరుణంలో సినిమాలకు ఆమె తీసుకుంటున్న రెమ్యూనరేషన్ పెంచినట్లు వార్తలు వస్తున్నాయి. హీరోయిన్‌గానే కాకుండా స్పెషల్ సాంగ్స్‌లోనూ ఆమె తళుక్కున మెరుస్తోంది. రామ్‌చరణ్ సరసన రంగస్థలం సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేసింది.
ఇదే తరహాలో ఎఫ్3 సినిమాలో కూడా ఓ స్పెషల్ సాంగ్ చేయమని మేకర్స్ ఆమెను సంప్రదించారని తెలుస్తోంది. ఒక్క పాటకు ఆమె రూ.కోటి 25 లక్షలు డిమాండ్ చేసిందని సమాచారం. అయితే ఆ పాటకు ఆమె అవసరమని గ్రహించిన మేకర్స్ రూ.కోటి ఫైనల్ చేసినట్లు ప్రచారం సాగుతోంది. కేవలం ఒక్కపాటకే ఆమె కోటి రూపాయలు తీసుకుంటుందని తెలిసి అంతా అవాక్కవుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa