రామ్ చరణ్‌తో తెరపై ఇది వరకూ జత కట్టింది రకుల్ ప్రీత్ సింగ్. చరణ్ హీరోగా నటించిన బ్రూస్‌లీ, ధ్రువ సినిమాల్లో రకుల్ హీరోయిన్‌గా నటించింది. వీటిల్లో ధ్రువ హిట్‌గా నిలిచింది. ఇక ప్రస్తుతం రకుల్ కెరీర్ అంత ఊపు మీద లేదు. టాలీవుడ్‌లో ఈ భామకు అవకాశాలు మందగించాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఐటమ్ సాంగ్స్ చేయడానికి కూడా రకుల్ సై అంటున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అందులో భాగంగా ఆమె చరణ్ సినిమాలో అవకాశాన్ని సొంతం చేసుకుందని సమాచారం.
బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో రకుల్ ప్రీత్ సింగ్ ఐటమ్ సాంగ్ చేయబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అధికారిక ప్రకటన ఏమీ లేదు కానీ.. ఈ మేరకు ప్రచారం అయితే సాగుతోంది. హీరోయిన్‌గా అవకాశాలు మందగించిన నేపథ్యంలో రకుల్ ఐటమ్ సాంగ్‌కు సై అనే ఉంటుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. అందులోనూ చరణ్‌తో ఆమె జోడీ ఇది వరకే హిట్ అయ్యింది. అలాగే ఈ రోజుల్లో ఐటమ్ సాంగ్స్‌లో నర్తించే హీరోయిన్లకు భారీ పారితోషకం కూడా లభిస్తోంది. దీంతో రకుల్ ఐటమ్ సాంగ్‌కు సై అనే ఉండవచ్చు. ఈ విషయంపై త్వరలోనే పూర్తి స్పష్టత వచ్చే అవకాశముంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa