ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐఫా-2018 విజేతల లిస్ట్

cinema |  Suryaa Desk  | Published : Mon, Jun 25, 2018, 12:14 PM

ప్రతి ఏడాదిలాగానే ఈ ఏడాది కూడా ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌(ఐఫా) వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. బ్యాంకాక్‌లో ఆదివారం రాత్రి జరిగిన ఈ వేడుకలకు అతిరధ మహారధులు హాజరై , ఈ కార్యక్రమాన్ని రంజిపచేసారు. కరణ్‌జోహార్‌, నటుడు రితేశ్‌ దేశ్‌ముఖ్‌ ఈ కార్య క్రమానికి హోస్ట్ గా వ్యవహరించడం జరిగింది. దివంగత నటి శ్రీదేవి ‘మామ్’‌ చిత్రానికిగాను ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. ఆమె తరఫున భర్త బోనీ కపూర్‌ ఈ అవార్డును అందుకొని , స్టేజ్ ఫై మాట్లాడుతూ కన్నీరు పెట్టుకున్నారు.


అలాగే ‘హిందీ మీడియమ్‌’ సినిమాకు గాను బాలీవుడ్‌ నటుడు ఇర్ఫాన్‌ఖాన్‌కు ఉత్తమ నటుడి అవార్డు దక్కింది. ప్రస్తుతం ఇర్ఫాన్‌ అనారోగ్యంతో లండన్‌లో చికిత్స తీసుకుంటుండంతో ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. ఇటీవల కన్నుమూసిన ప్రముఖ నటులు శ్రీదేవి, వినోద్‌ ఖన్నా, శశికపూర్‌కు ఐఫా ఘనంగా నివాళులు అర్పించింది.


ఇక 2018 ఐఫా విజేతల లిస్ట్ ఈ విధంగా ఉంది..


ఉత్తమ చిత్రం : తుమ్హారి సులు


ఉత్తమ నటుడు : ఇర్ఫాన్‌ ఖాన్‌(హిందీ మీడియం)


ఉత్తమ నటి : శ్రీదేవి(మామ్‌)


ఔట్‌స్టాండింగ్‌ అచివ్‌మెంట్‌ అవార్డు : అనుపమ్‌ ఖేర్‌


ఉత్తమ దర్శకుడు : సాకేత్‌ చౌదరి(హిందీ మీడియం)


ఉత్తమ కథ : న్యూటన్‌


ఉత్తమ సహాయ నటుడు : నవాజుద్దీన్‌ సిద్దిఖీ(మామ్‌)


ఉత్తమ సహాయన నటి : మెహర్‌ విజ్‌ (సీక్రెట్‌ సూపర్‌ స్టార్‌)


ఉత్తమ సంగీత దర్శకుడు :అమాల్‌మాలిక్‌, తనిష్క్‌ బగ్చీ, అఖిల సచ్‌దేవ(బద్రీనాథ్‌కి దుల్హనియా)


ఉత్తమ గాయని :మెఘనా మిశ్రా(జగ్గా జాసూస్‌)


ఉత్తమ గాయకుడు : అర్జిత్‌ సింగ్‌ (జబ్‌ హ్యారీ మెట్‌ సెజల్‌)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa