ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మళ్లీ కాజల్‌తోనే రొమాన్స్‌

cinema |  Suryaa Desk  | Published : Mon, Jun 25, 2018, 12:18 PM

టాలీవుడ్‌ చందమామ కాజల్‌ అగర్వాల్‌కు అవకాశాలు అస్సలు తగ్గటం లేదు. ఫ్రెష్‌ ఫేస్‌లకు పోటీగా ఆమె కెరీర్‌ కొనసాగుతోంది. ఓవైపు సీనియర్లతోపాటు కుర్ర హీరోలతోనూ రొమాన్స్‌ చేస్తోంది. తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా తెరకెక్కుతున్న ఓ చిత్రంలో ఆమె నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంతో శ్రీనివాస్‌ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు.  అయితే ఈ యువ హీరోతోనే ఆమె మరో ప్రాజెక్టుకు ఓకే చెప్పినట్లుగా ఓ వార్త వినిపిస్తోంది. తేజ దర్శకత్వంలో ఓ ప్రాజెక్టు కోసం ఈ ఇద్దరు మరోసారి జోడీ కట్టబోతున్నారని తెలుస్తోంది. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కబోయే ఈ ప్రాజెక్టును ఏకే ఎంటర్‌టైనర్‌మెంట్స్‌ బ్యానర్‌పై అనిల్‌ సుంకర నిర్మించబోతున్నారన్నది ఆ కథనం సారాంశం. ప్రస్తుతం తేజ స్క్రిప్ట్‌ పనుల్లో బిజీగా ఉన్నట్లు చెబుతున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa