నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున 'బీస్ట్' సినిమా ఈరోజు గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్ ట్రాక్ లో రానున్న ఈ సినిమాలో విజయ్ సరసన సిజ్లింగ్ బ్యూటీ పూజాహెగ్డే జంటగా నటిస్తుంది. ఇకువైట్‌లో ఈ సినిమాపై నిషేధం విధించిన సంగతి అందరికి తెలిసిందే. పాకిస్థాన్ మంత్రిని అపహరించే సీన్ ఉండటమే అందుకు కారణం అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ఎక్కువుగా హింస, ఉగ్రవాదానికి సంబంధించిన సన్నివేశాలు ఉన్నాయని కూడా అంటున్నారు. ఈ కారణంగా ఈ సినిమాను కువైట్ ప్రభుత్వం నిషేధించింది. తాజాగా ఇప్పుడు, ఖతార్ లో కూడా 'బీస్ట్' సినిమాను నిషేదించారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa