గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటసింహ బాలకృష్ణ 'NBK107' సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్ జోడిగా నటిస్తోంది. దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. హైదరాబాద్‌లోని ఆర్‌ఎఫ్‌సిలో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం, షూటింగ్ కోసం మేకర్స్ భారీ సెట్‌ను ఏర్పాటు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ హౌస్ సెట్‌లో సినిమాకు సంబంధించిన ముఖ్యమైన సన్నివేశాలను మేకర్స్ షూట్ చేయనున్నారు అని లేటెస్ట్ టాక్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి థమన్ ఎస్ సంగీతం అందించారు. ఈ 2022 దసరాకి సినిమా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa