RX100, వెంకీ మామ, డిస్కో రాజా వంటి సినిమాలలో నటించిన గ్లామర్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈ బ్యూటీ మీడియా ఇంటరాక్షన్ లో మాట్లాడుతూ తన రాబోయే ఎంటర్‌టైనర్ సినిమా 'గాలి నాగేశ్వరరావు' గురించి కొన్ని ఆసక్తికర విషయాలని వెల్లడించింది. ఈ సెటైరికల్ ఎంటర్‌టైనర్ సినిమాలో మంచు విష్ణు కథానాయకుడిగా నటిస్తుండగా, సన్నీ లియోన్ మరో హీరోయిన్‌గా నటిస్తుంది. ఈశన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కోన వెంకట్ అండ్ జి.నాగేశ్వర రెడ్డి స్క్రిప్ట్ వర్క్‌ను నిర్వహిస్తున్నారు. ఈ సినిమాలో తను స్వాతి పాత్రలో నటిస్తున్నట్లు తెలిపారు. 'అనుకోకుండా ఓ అతిధి' సినిమాలో తన నటనను ఇష్టపడిన తర్వాత మోహన్ బాబు తనకు ఈ అవకాశం ఇచ్చినట్లు ఆమె చెప్పింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa